Breaking News

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో మిస్ వెనిజులా ఆండ్రియా డెల్ వాల్ పై ఆమె సెలబ్రిటీ స్టైలిస్ట్ జియోవన్నీ లగునా కత్తెరతో ఘోరంగా దాడి చేశాడు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఫ్రాన్స్‌లో మే 2026 లో మిస్ వెనిజులా ఆండ్రియా డెల్ వాల్ (Andrea del Val) పై ఆమె సెలబ్రిటీ స్టైలిస్ట్ జియోవన్నీ లగునా కత్తెరతో ఘోరంగా దాడి చేశాడు.


Published on: 22 May 2026 18:59  IST

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఫ్రాన్స్‌లో మే 2026 లో మిస్ వెనిజులా ఆండ్రియా డెల్ వాల్ (Andrea del Val) పై ఆమె సెలబ్రిటీ స్టైలిస్ట్ జియోవన్నీ లగునా కత్తెరతో ఘోరంగా దాడి చేశాడు.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవాల వేళ, ఆండ్రియా డెల్ వాల్ బస చేసిన ఒక హోటల్ గదిలో ఈ దారుణం జరిగింది.కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఆమె ప్రదర్శన ఇవ్వడానికి మరికొద్ది సేపట్లో సిద్ధమవ్వాలనగా ఈ గొడవ జరిగింది.వీరిద్దరి మధ్య హోటల్ రూమ్‌లో పెద్ద ఎత్తున అరుపులు, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే స్టైలిస్ట్ లగునా ఆమెపై కత్తెరతో ముఖంపై మరియు తలపై దాడి చేశాడు.

తీవ్ర గాయాలైనప్పటికీ ఆండ్రియా ధైర్యంగా తన మొబైల్ ఫోన్ తీసి, రక్తం కారుతున్న తన ముఖాన్ని సోషల్ మీడియాలో లైవ్/వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేసింది.ఆ వీడియోలో ఆమె స్పానిష్ భాషలో మాట్లాడుతూ.. "చూడండి, జియోవన్నీ లగునా నా ముఖాన్ని ఏం చేశాడో.. అభినందనలు జియోవన్నీ, నీ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించావు" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో హోటల్ గది అంతా వస్తువులు విసిరేసి, చిందరవందరగా మారి ఉంది. దాడి చేసిన స్టైలిస్ట్ లగునా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా గదిలోని ఒక కుర్చీలో కూర్చుని ఉండటం ఆ వీడియోలో కనిపించింది.

పక్క రూమ్‌లలో ఉన్న అతిథులు హోటల్ గదిలో జరుగుతున్న గొడవను, అరుపులను విని వెంటనే హోటల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.ఫ్రెంఛ్ పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని లాటిన్ అమెరికాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా ఉన్న జియోవన్నీ లగునా (33) ను అదుపులోకి తీసుకుని, బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు మరియు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి