Breaking News

ముంబైలోని ప్రముఖ తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన అన్షులా కపూర్ రిసెప్షన్ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన టాప్ సెలబ్రిటీలు అందరూ హాజరై సందడి చేశారు

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సోదరి అయిన అన్షులా కపూర్, స్క్రీన్‌రైటర్ రోహన్ థక్కర్‌ల వివాహ వేడుక అనంతరం ముంబైలోని ప్రముఖ తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన టాప్ సెలబ్రిటీలు అందరూ హాజరై సందడి చేశారు.


Published on: 08 Jul 2026 19:33  IST

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సోదరి అయిన అన్షులా కపూర్, స్క్రీన్‌రైటర్ రోహన్ థక్కర్ల వివాహ వేడుక అనంతరం ముంబైలోని ప్రముఖ తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన టాప్ సెలబ్రిటీలు అందరూ హాజరై సందడి చేశారు.

కపూర్ కుటుంబ సభ్యులు

జానీ కపూర్: అన్షులా కపూర్ సోదరి అయిన జానీ కపూర్, మెరిసే లావెండర్-గోల్డ్ సిల్క్ శారీ, స్ట్రాప్‌లెస్ బ్లౌజ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

అనిల్ కపూర్: ఎప్పటికీ నవయువకుడిగా కనిపించే అనిల్ కపూర్, ఎంతో స్టైలిష్‌గా బ్లాక్ బంద్‌గాలా సూట్‌లో ఈ వేడుకకు విచ్చేశారు.

అర్జున్ కపూర్ , ఖుషీ కపూర్: పెళ్లి కూతురు సోదరుడు అర్జున్ కపూర్ మరియు సోదరి ఖుషీ కపూర్లు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

షనాయా కపూర్: ఇండో-వెస్ట్రన్ అవుట్‌ఫిట్ మరియు స్మోకీ మేకప్ లుక్‌లో అద్భుతంగా మెరిసింది.

బోనీ కపూర్: వరుడు, వధువుల తరపున అతిథులను ఆహ్వానిస్తూ ఎరుపు రంగు సూట్, అనంతరం క్లాసిక్ వైట్ టక్సేడోలో మెరిశారు.

వేడుకకు హాజరైన ఇతర బాలీవుడ్ ప్రముఖులు

రేఖ: బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ రేఖ సంప్రదాయబద్ధమైన గోల్డ్, వైట్, అండ్ పింక్ బనారసి సిల్క్ శారీ మరియు భారీ బంగారు ఆభరణాలతో రాయల్ లుక్‌లో కనిపించారు.

జాకీ ష్రాఫ్: ఎంతో ప్రత్యేకంగా కొత్త దంపతులకు ఒక మొక్కను కానుకగా ఇస్తూ, బ్లాక్ బంద్‌గాలా సూట్‌లో విచ్చేశారు.

బాబీ డియోల్: తనదైన స్టైలిష్ లుక్‌తో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.

రితేష్ దేశ్‌ముఖ్ & జెనీలియా: ఈ లవ్లీ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ప్రత్యేకంగా నిలిచారు.

వరుణ్ ధావన్: ఈ స్టార్ హీరో కూడా వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

భూమి పెడ్నేకర్: సంప్రదాయ లుక్‌లో హాజరై కెమెరాలకు ఫోజులిచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్ & జాకీ భగ్నానీ: ఈ జంట కూడా అత్యంత స్టైలిష్ దుస్తులలో రిసెప్షన్‌కు హాజరయ్యారు.

అట్లీ , ప్రియ: 'జవాన్' చిత్ర దర్శకుడు అట్లీ తన భార్య ప్రియతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.

జావేద్ అఖ్తర్ & షబానా అజ్మీ: ఈ సీనియర్ కపుల్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్స్‌లో కలసికట్టుగా విచ్చేశారు.

సోను నిగమ్ & అను మాలిక్: సంగీత ప్రపంచానికి చెందిన వీరు కూడా ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement