Breaking News

పెనుకొండలో ఆర్టీసీ బస్సు ,లారీ ఢీ

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండమండలం గుట్టూరు వద్ద ఆదివారం (ఫిబ్రవరి 8, 2026) ఆర్టీసీ బస్సు మరియు లారీ ఢీకొన్నాయి


Published on: 09 Feb 2026 10:30  IST

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండమండలం గుట్టూరు వద్ద ఆదివారం (ఫిబ్రవరి 8, 2026) ఆర్టీసీ బస్సు మరియు లారీ ఢీకొన్నాయి.హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ధర్మవరం వెళ్తుండగా, జాతీయ రహదారి 44పై గుట్టూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద లారీ బస్సును ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సు కండక్టర్ చాంద్ బాషా, డ్రైవర్ వెంకటరమణ నాయక్‌తో పాటు దాదాపు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.రాష్ట్ర మంత్రి సవిత ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు మరియు వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

Follow us on , &

ఇవీ చదవండి