Breaking News

బుట్టా రేణుక, భర్త నీలకంఠ శివకు వేలంనోటీసు

కర్నూలుకు చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు ఆమె భర్త నీలకంఠ శివకు చెందిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) నిర్ణయించింది. 

Published on: 21 Feb 2026 10:19  IST

కర్నూలుకు చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు ఆమె భర్త నీలకంఠ శివకు చెందిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) నిర్ణయించింది. 

ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ బెంగళూరు బ్రాంచి ఫిబ్రవరి 20, 2026 (శుక్రవారం) నాడు ఈ వేలం నోటీసును జారీ చేసింది.హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ (ఫేజ్‌-6) లో ఉన్న 3,833.28 చదరపు గజాల స్థలం, ఇందులో మెరిడియన్‌ పాఠశాల భవనం కూడా ఉంది.ఈ ఆస్తి విలువను సుమారు రూ. 65 కోట్లుగా నిర్ణయించారు.

-బిడ్ (E-Bid) దాఖలు: 23 మార్చి 2026 వరకు అవకాశం ఉంది.ఈ-వేలం (E-Auction) తేదీ: 24 మార్చి 2026 న వేలం నిర్వహించనున్నారు.గతంలో తీసుకున్న సుమారు రూ. 340 కోట్ల రుణం, వడ్డీలతో కలిపి ప్రస్తుతం రూ. 782.07 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement