Breaking News

తిరుమలలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ 

మార్చి 5, 2026న తిరుమలలో టీటీడీ విజిలెన్స్ మరియు ఇతర భద్రతా దళాల ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) నేతృత్వంలో ఒక ముఖ్యమైన యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ ముగిసింది.


Published on: 05 Mar 2026 15:30  IST

మార్చి 5, 2026న తిరుమలలో టీటీడీ విజిలెన్స్ మరియు ఇతర భద్రతా దళాల ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) నేతృత్వంలో ఒక ముఖ్యమైన యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ ముగిసింది. 

ఈ భారీ మాక్ డ్రిల్‌లో టీటీడీ విజిలెన్స్ విభాగంతో పాటు, ఎన్.ఎస్.జి (NSG) కమాండోలు, ఆక్టోపస్ (OCTOPUS) దళాలు మరియు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.ఉగ్రవాద దాడులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తుల రక్షణ, బందీల విముక్తి మరియు టీటీడీ ఆస్తులను కాపాడటంలో భద్రతా దళాల సంసిద్ధతను పరీక్షించడం ఈ డ్రిల్ ప్రధాన లక్ష్యం.జిల్లా యంత్రాంగం మరియు భద్రతా విభాగాల సమన్వయంతో మార్చి 3 నుండి మార్చి 5 వరకు మూడు రోజుల పాటు తిరుపతి మరియు తిరుమలలోని వివిధ కీలక ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించారు.

ఉగ్రవాదులు చొరబడినప్పుడు వారిని ఎదుర్కోవడం, రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు మరియు భక్తులను సురక్షితంగా తరలించే పద్ధతులను భద్రతా సిబ్బంది ప్రయోగాత్మకగా చేసి చూపారు.టీటీడీ సీవీఎస్ఓ (CVSO) మరియు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలను పర్యవేక్షించి, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి