Breaking News

స్నేహితురాలిని ముక్కలుగా నరికిన ఘటన

విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్(గాజువాక ప్రాంతం)లో 2026, మార్చి 30వ తేదీన ఒక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఓ నేవీ ఉద్యోగి తన స్నేహితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Published on: 30 Mar 2026 10:18  IST

విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్(గాజువాక ప్రాంతం)లో 2026, మార్చి 30వ తేదీన ఒక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఓ నేవీ ఉద్యోగి తన స్నేహితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35). ఇతడు విశాఖలో నేవీ టెక్నీషియన్‌గా పనిచేస్తూ, ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.రవీంద్ర భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లడంతో, ఆదివారం రాత్రి (మార్చి 29) మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, రవీంద్ర ఆమెను హత్య చేశాడు.

హత్య అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, రెండు మూటల్లో కట్టి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. కొన్ని శరీర భాగాలు ఇంట్లోనే మూలకు పడేసినట్లు సమాచారం.ఈ దారుణం చేసిన తర్వాత రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ మానసిక ఒత్తిడి భరించలేకే ఈ హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.

Follow us on , &

ఇవీ చదవండి