Breaking News

మోహినీ అలంకారంలో కోదండరామస్వామి

వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఈరోజు 31 మార్చి 2026 (మంగళవారం) ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. 

Published on: 31 Mar 2026 16:28  IST

వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఈరోజు 31 మార్చి 2026 (మంగళవారం) ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. 

బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన నేడు, ఉదయం 7:30 గంటలకు స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.లోకకల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ధరించిన మోహినీ రూపంలో రాములవారు అలంకృతులై, పల్లకీపై పురవీధుల్లో విహరించారు.

కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి సేవ కోలాహలంగా సాగింది.భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. నేడు (మార్చి 31) రాత్రి 7:00 గంటల నుండి అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. రేపు, ఏప్రిల్ 1 తేదీ రాత్రి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement