Breaking News

సెల్ఫీ దిగుతూనీటిలో పడి ముగ్గురు బాలికలు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2026, ఏప్రిల్ 9వ తేదీ గురువారం నాడు ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అనంతగిరి మండలంలోని మూలగుమ్మి జలపాతం  వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. 

Published on: 09 Apr 2026 19:11  IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2026, ఏప్రిల్ 9వ తేదీ గురువారం నాడు ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అనంతగిరి మండలంలోని మూలగుమ్మి జలపాతం  వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. 

మృతులను హుకుంపేట మండలం, జుంబువలస గ్రామానికి చెందిన త్రిష (17)రత్నకుమారి (16), మరియు పవిత్ర (16) గా గుర్తించారు.వీరితో పాటు ఉన్న అంజలి అనే మరో బాలికను స్థానికులు రక్షించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు లుంగపర్తి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో సరదాగా గడపడానికి జలపాతం వద్దకు వెళ్లిన వీరు, జలపాతం అంచున నిలబడి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒకరు కాలు జారడంతో మిగిలిన వారు కూడా నీటిలో పడి కొట్టుకుపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలపాతాల వద్ద సెల్ఫీల కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి