Breaking News

కదిరిలో ఘోర ప్రమాదం నలుగురు మృతి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిమండలం కుమ్మరవాండ్లపల్లిలో ఏప్రిల్ 15, 2026న జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.


Published on: 15 Apr 2026 15:17  IST

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఏప్రిల్ 15, 2026న జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కుమ్మరవాండ్లపల్లిలోని ఒక నివాస గృహంలో బుధవారం ఉదయం ఈ భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో మరో 8 నుండి 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేలుడు అని భావించినప్పటికీ, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన డిటోనేటర్లు పేలడం వల్ల సిలిండర్లు కూడా పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.పేలుడు ధాటికి ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టం కాగా, పక్కనే ఉన్న ఇళ్లు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 

 

Follow us on , &

ఇవీ చదవండి