Breaking News

కారును వెనుక వైపు నుంచి ఢీకొట్టిన లారీ

గుంటూరు జిల్లా తాడికొండ గ్రామ శివారులో ఈరోజు (18 మే 2026) ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికొండ నుంచి తుళ్లూరు వైపు వెళ్తున్న కారును వెనుక వైపు నుంచి ఒక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టినది.

Published on: 18 May 2026 19:00  IST

గుంటూరు జిల్లా తాడికొండ గ్రామ శివారులో ఈరోజు (18 మే 2026) ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికొండ నుంచి తుళ్లూరు వైపు వెళ్తున్న కారును వెనుక వైపు నుంచి ఒక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టినది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.టిప్పర్ వేగంగా ఢీకొట్టడంతో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.అదే సమయంలో ఆ లారీ వెనుక వస్తున్న ఒక స్కూటీ కూడా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, పారిపోవడానికి ప్రయత్నించిన టిప్పర్ లారీ డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ప్రస్తుతం బాధితులు ఈ ఘటనపై తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి