Breaking News

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామంలో ఆశ (23) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన జూన్ 17, 2026 (బుధవారం) తెల్లవారుజామున చోటుచేసుకుంది.


Published on: 18 Jun 2026 17:10  IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామంలో ఆశ (23) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన జూన్ 17, 2026 (బుధవారం) తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా చిన్నోబనహళ్లి గ్రామానికి చెందిన ఆశకు, జుంజురాంపల్లి గ్రామానికి చెందిన వన్నూరుస్వామి అలియాస్ కృష్ణతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

భర్త వన్నూరుస్వామి రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. జూన్ 16 (మంగళవారం) రాత్రి కూడా భర్త మద్యం మత్తులో వచ్చి గొడవ పడటంతో మనస్తాపానికి గురైన ఆశ, బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.ఆశ ఆత్మహత్య చేసుకోలేదని, మెట్టినింటి వారే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, పుట్టింటి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement