Breaking News

నల్లమల ఎర్రవాగులో వజ్రాల వేట జోరుగా

నల్లమల అటవీ ప్రాంతంలోని ఎర్రవాగులో వజ్రాల వేట జోరుగా . నంద్యాల - ఒంగోలు జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతానికి, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అడవి నుంచి నీరు కొట్టుకురావడంతో స్థానికులు, పరిసర జిల్లాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.


Published on: 15 Jul 2026 17:53  IST

నల్లమల అటవీ ప్రాంతంలోని ఎర్రవాగులో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. నంద్యాల - ఒంగోలు జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతానికి, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అడవి నుంచి నీరు కొట్టుకురావడంతో స్థానికులు, పరిసర జిల్లాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

నంద్యాల - ఒంగోలు ప్రధాన మార్గంలోని నల్లమల అడవిలో ఉన్న ఈ వాగులోనే ప్రధానంగా వెతుకులాట సాగుతోంది.నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని సర్వనరసింహ స్వామి ఆలయ పరిసర వాగుల్లో కూడా జనం గుమిగూడుతున్నారు.

నంద్యాల, కర్నూలు, ప్రకాశం, మార్కాపురం, కడప, గుంటూరు జిల్లాల నుంచి వందలాది మంది మహిళలు, పురుషులు ఇక్కడికి చేరుకుంటున్నారు.వర్షపు నీటితో పాటు అడవిలోని వజ్రాలు వాగులోకి కొట్టుకొచ్చి ఉంటాయనే నమ్మకంతో, నీటి అడుగు భాగంలో మట్టిని, రాళ్లను జల్లెడ పడుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడే నెలల తరబడి గుడారాలు వేసుకుని మరీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అధికారుల హెచ్చరికలు

వదంతులు నమ్మవద్దు: నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇబ్బందులు పడొద్దు: అడవిలోకి వచ్చి ఇబ్బందులు పడవద్దని, కేవలం రంగురాళ్లు లేదా సుద్దరాళ్లు మాత్రమే దొరుకుతాయని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement