Breaking News

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో చీరల రాధ (37) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండటం కలకలం రేపింది.మృతురాలు నెల్లూరు జిల్లా ఆదురిపల్లెకు చెందిన చీరల రాధగా పోలీసులు గుర్తించారు.


Published on: 31 Jul 2026 18:37  IST

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లో చీరల రాధ (37) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండటం కలకలం రేపింది.మృతురాలు నెల్లూరు జిల్లా ఆదురిపల్లెకు చెందిన చీరల రాధగా పోలీసులు గుర్తించారు. ఆమె బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, భర్త రవి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులోనే నివసిస్తోంది.

ఎప్పటిలాగే విధులకు వెళ్లిన రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆ తర్వాత ఆమె కుప్పం రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement