Breaking News

భారీ మొత్తం డబ్బు డిమాండ్ ముగ్గురు అరెస్ట్

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిన ఘటన.


Published on: 14 Jan 2026 12:16  IST

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిన ఘటన.ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను వాట్సాప్ కాల్స్ మరియు మెసేజ్‌ల ద్వారా బెదిరించి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులు ఎంపీకి చెందిన వ్యక్తిగత మరియు వ్యాపార సమాచారం తమ వద్ద ఉందని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెట్టి పరువు తీస్తామని బెదిరించారు. మొదట వీరు రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ బెదిరింపులపై ఎంపీ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పుట్టా మహేష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) తరపున ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి