Breaking News

రోడ్డు ప్రమాదంలో ఒక గిగ్ వర్కర్ దుర్మరణం

విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ బీఆర్‌టీఎస్‌ (BRTS) మధ్య రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక గిగ్ వర్కర్ (డెలివరీ బాయ్) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.


Published on: 21 May 2026 18:38  IST

విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ బీఆర్టీఎస్‌ (BRTS) మధ్య రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక గిగ్ వర్కర్ (డెలివరీ బాయ్) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

బిగ్‌ బాస్కెట్‌ (BigBasket) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న బొమ్మిడి మురళి (27) బుధవారం మధ్యాహ్నం చినముషిడివాడ నుంచి పెందుర్తి వైపు తన ద్విచక్ర వాహనంపై డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాడు.బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై తన ముందు వెళ్తున్న ఆర్టీసీ (RTC) బస్సును ఓవర్‌ టేక్‌ చేయబోతుండగా ఎదురుగా అకస్మాత్తుగా ఒక కారు వచ్చింది. దాంతో గందరగోళానికి గురైన మురళి బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు.

అదే సమయంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుకచక్రాలు మురళి తలపై నుంచి దూసుకుపోవడంతో అతను సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని విజయనగరం జిల్లా కల్లెంపూడికి చెందిన బొమ్మిడి మురళిగా పోలీసులు గుర్తించారు.బతుకుదెరువు కోసం విశాఖ వచ్చి చినముషిడివాడ పాత ఊరులో నివాసముంటున్నాడు.అతనికి భార్య వెంకటలక్ష్మి, మూడేళ్ల కుమారుడు (హిమాంత్‌) ఉన్నారు. మురళి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి