Breaking News

గుత్తి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో మే 26, 2026 (మంగళవారం) తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురై బోల్తా పడింది. గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారి (NH-44) పై ఈ ప్రమాదం జరిగింది.


Published on: 26 May 2026 17:59  IST

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో మే 26, 2026 (మంగళవారం) తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురై బోల్తా పడింది. గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో 44 జాతీయ రహదారి (NH-44) పై ఈ ప్రమాదం జరిగింది.ఇది 'కేకే ట్రావెల్స్' (KK Travels) కు చెందిన ప్రైవేట్ బస్సు.ఈ బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయి, డ్రైవర్ అదుపు కోల్పోవడంతో బస్సు మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కూడా ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను మొదట గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 10 మందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి