Breaking News

కడపలో ఘోరమైన ప్రేమోన్మాద ఘటన

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో 10 ఏప్రిల్ 2026న ఒక ఘోరమైన ప్రేమోన్మాద ఘటన చోటుచేసుకుంది.


Published on: 10 Apr 2026 19:57  IST

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో 10 ఏప్రిల్ 2026న ఒక ఘోరమైన ప్రేమోన్మాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు, తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఒక మైనర్ బాలికను దారుణంగా హత్య చేశాడు. 

ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన (17). ఈమె ఖాజీపేట మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది.ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్ (19). ఇతడు డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.వెంకటేశ్ కొంతకాలంగా కీర్తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. అయితే కీర్తన మరియు ఆమె తల్లిదండ్రులు ఇందుకు నిరాకరించారు.

శుక్రవారం (ఏప్రిల్ 10) ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు ఆమెపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు.తీవ్ర గాయాలైన కీర్తనను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా, చెన్నూరు సమీపంలో దారిలోనే ప్రాణాలు విడిచింది.

Follow us on , &

ఇవీ చదవండి