Breaking News

కావలిలో వాహనం ఢీకొనడంతో ఒక జింక మృతి

2026 ఫిబ్రవరి 10న నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన సంఘటన.కావలి సమీపంలోని ముసునూరు టోల్‌ప్లాజా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక జింక మృతి చెందింది.


Published on: 10 Feb 2026 15:52  IST

2026 ఫిబ్రవరి 10న నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన సంఘటన.కావలి సమీపంలోని ముసునూరు టోల్‌ప్లాజా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక జింక మృతి చెందింది.రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన వాహనం జింకను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.ఆహారం, నీటి కోసం వన్యప్రాణులు అడవి దాటి జాతీయ రహదారిపైకి వస్తున్న తరుణంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి