Breaking News

చంద్రబాబు నివాసంలో పవన్తో కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య నేడు (ఫిబ్రవరి 4, 2026) ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక భేటీ ముగిసింది.


Published on: 04 Feb 2026 15:42  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య నేడు (ఫిబ్రవరి 4, 2026) ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.త్వరలో రాష్ట్రంలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీ, కూటమి అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక చర్చ జరిగింది.తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (SIT) నివేదిక, నిన్నటి కేబినెట్ నిర్ణయాల తదుపరి కార్యాచరణపై చర్చించారు.

రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. కూటమి పార్టీల శ్రేణుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలకు చెక్ పెట్టేలా వ్యూహరచన చేశారు.పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ప్రచారం చేయనున్న నేపథ్యంలో ఆ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement