Breaking News

ఆర్టీసీ డ్రైవర్‌కు అస్వస్థత తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత (గుండెపోటు లక్షణాలు) రావడంతో ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదం పామూరు డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ (Hire) బస్సులో జరిగింది.

Published on: 22 Jul 2026 19:56  IST

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత (గుండెపోటు లక్షణాలు) రావడంతో ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదం పామూరు డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ (Hire) బస్సులో జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పామూరు నుండి నెల్లూరు వైపు వెళ్తోంది.నెల్లూరు జిల్లా సంఘం వద్దకు రాగానే, నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై డ్రైవర్ త్రిమోది అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయినప్పటికీ ఆయన ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా ఆపగలిగారు.డ్రైవర్ సరైన సమయంలో బస్సును కంట్రోల్ చేయడంతో, జాతీయ రహదారిపై జరగాల్సిన ఒక భారీ ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి