Breaking News

రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో (మార్చి 20, 2026) వాతావరణం ప్రధానంగా అల్పపీడన ద్రోణి మరియు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉండనుంది. 


Published on: 20 Mar 2026 17:28  IST

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో (మార్చి 20, 2026) వాతావరణం ప్రధానంగా అల్పపీడన ద్రోణి మరియు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని  నివేదించింది.దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి