Breaking News

తిరుమలలో భవనంపైనుంచి పడి కార్మికుడు మృతి

తిరుమలలో మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఒక కార్మికుడు మృతి చెందాడు.తిరుమలలోని అవధూత దత్తపీఠం వద్ద ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.


Published on: 19 May 2026 14:27  IST

తిరుమలలో మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఒక కార్మికుడు మృతి చెందాడు.తిరుమలలోని అవధూత దత్తపీఠం వద్ద ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.సదరు కార్మికుడు అక్కడ ఉన్న ఒక వాటర్ ట్యాంక్ మరమ్మతులు (రిపేర్) చేస్తుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి మూడంతస్తుల భవనం పైనుంచి కిందపడిపోయాడు.కిందపడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న తోటి సిబ్బంది వెంటనే అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతడు మరణించాడు.మణికంఠన్ (35 సంవత్సరాలు) తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ పరిధిలో గల వనియంబాడి ప్రాంతానికి చెందినవాడు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి