Breaking News

పాస్ పుస్తకాల ట్యాంపర్ చేస్తే జైలుకే చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


Published on: 06 Feb 2026 17:31  IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.పాస్ పుస్తకాల్లోని వివరాలను ఎవరైనా ట్యాంపర్ చేయడానికి లేదా మార్చడానికి ప్రయత్నిస్తే, సంబంధిత అధికారులు మరియు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.భూ రికార్డుల భద్రత కోసం ప్రభుత్వం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీనివల్ల రికార్డులను ఎవరూ మార్చలేరు (tamper-proof) అని భరోసా ఇచ్చారు.

రైతులు తమ పాస్ పుస్తకంలోని QR కోడ్ స్కాన్ చేసి ఎప్పుడైనా తమ వివరాలను సరిచూసుకోవచ్చని, ఏదైనా అనధికారిక మార్పు జరిగితే వెంటనే గుర్తించవచ్చని తెలిపారు.పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లకుండా గ్రామ సభల ద్వారా వివరాలు సరిచూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భూ యజమానుల్లో భరోసా నింపడానికి రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను నేరుగా పంపిణీ చేస్తున్నారు. తప్పుడు రికార్డులు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతామని, భూమి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి