Breaking News

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కిందపడి ఇంజనీర్‌ ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో బుధవారం (4 ఫిబ్రవరి 2026) ఒక విషాద ఘటన చోటుచేసుకుంది.


Published on: 04 Feb 2026 14:25  IST

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో బుధవారం (4 ఫిబ్రవరి 2026) ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ (36) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

మృతుడు హర్షవర్ధన్ ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.బుధవారం ఉదయం తన నివాసం నుంచి సూసైడ్ నోట్ రాసి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆయన ప్రాణాలు విడిచారు.

హర్షవర్ధన్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ముందే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తుండగానే దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. 

Follow us on , &

ఇవీ చదవండి