Breaking News

స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ (Novartis AG), తన భారతీయ విభాగమైన నోవార్టిస్ ఇండియా లిమిటెడ్ (NIL) లో ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ (Novartis AG), తన భారతీయ విభాగమైన నోవార్టిస్ ఇండియా లిమిటెడ్ (NIL) లో ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఫిబ్రవరి 20, 2026న ఒప్పందం కుదుర్చుకుంది.


Published on: 21 Feb 2026 16:36  IST

స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ (Novartis AG), తన భారతీయ విభాగమైన నోవార్టిస్ ఇండియా లిమిటెడ్ (NIL) లో ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఫిబ్రవరి 20, 2026న ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్‌క్యాపిటల్ (ChrysCapital) నేతృత్వంలోని కన్సార్టియం నోవార్టిస్ ఏజీ తనకున్న 70.68% వాటాను సుమారు ₹1,446 కోట్లకు విక్రయించింది.ఈ కొనుగోలు కారణంగా, కొత్త ఇన్వెస్టర్లు సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుండి అదనంగా 26% వాటాను సేకరించడానికి షేరుకు ₹860.64 ధరకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు.

ఒప్పందం పూర్తయిన 120 రోజుల్లోపు కంపెనీ పేరు నుండి 'నోవార్టిస్' అనే పదాన్ని తొలగించాల్సి ఉంటుంది.ఈ వార్త వెలువడిన వెంటనే ఫిబ్రవరి 20న స్టాక్ మార్కెట్లో నోవార్టిస్ ఇండియా షేర్లు 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. 

నోవార్టిస్ ఏజీ తన లిస్టెడ్ కంపెనీ (NIL) నుండి నిష్క్రమించినప్పటికీ, హైదరాబాద్‌లోని నోవార్టిస్ కార్పొరేట్ సెంటర్ మరియు దాని అనుబంధ సంస్థ నోవార్టిస్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (NHPL) ద్వారా భారత్‌లో తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తుంది. 

 

Follow us on , &

ఇవీ చదవండి