Breaking News

ర్యాపిడో (Rapido) సంస్థ 'ఓన్‌లీ' (Ownly) పేరుతో తన నూతన ఫుడ్ డెలివరీ యాప్‌ను అధికారికంగా ప్రారంభించింది.

ర్యాపిడో (Rapido) సంస్థ 'ఓన్‌లీ' (Ownly) పేరుతో తన నూతన ఫుడ్ డెలివరీ యాప్‌ను అధికారికంగా ప్రారంభించింది. మార్చి 3, 2026 నుండి ఈ సేవలు బెంగళూరు నగరం అంతటా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. 


Published on: 05 Mar 2026 18:51  IST

ర్యాపిడో (Rapido) సంస్థ 'ఓన్లీ' (Ownly) పేరుతో తన నూతన ఫుడ్ డెలివరీ యాప్‌ను అధికారికంగా ప్రారంభించింది. మార్చి 3, 2026 నుండి ఈ సేవలు బెంగళూరు నగరం అంతటా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. 

స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు రెస్టారెంట్ల నుండి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తాయి. కానీ, 'ఓన్‌లీ' యాప్ రెస్టారెంట్ల నుండి ఎటువంటి కమీషన్ వసూలు చేయదు.

₹400 లోపు ఆర్డర్లకు ₹25 డెలివరీ ఫీజు ఉంటుంది.

₹400 పైన ఉండే ఆర్డర్లకు ₹50 డెలివరీ ఫీజు వసూలు చేస్తారు.

రెస్టారెంట్ల నుండి కమీషన్ తీసుకోదు కాబట్టి, ఇతర యాప్‌లతో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు తక్కువగా ఉంటాయని సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఈ సేవలు కేవలం బెంగళూరు (Bengaluru) లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

డౌన్‌లోడ్: ఈ యాప్ Google Play Store మరియు Apple App Store లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 
 

Follow us on , &

ఇవీ చదవండి