Breaking News

వివో సంస్థ మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ సెగ్మెంట్‌లోని ఎంపిక చేసిన మోడళ్లపై ₹1,000 నుండి ₹4,000 వరకు ధరలను పెంచుతూ నిర్ణయం

వివో (vivo) సంస్థ తమ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 21 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వచ్చేలా మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ సెగ్మెంట్‌లోని ఎంపిక చేసిన మోడళ్లపై ₹1,000 నుండి ₹4,000 వరకు ధరలను పెంచినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 

Published on: 21 Apr 2026 19:21  IST

వివో (vivo) సంస్థ తమ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 21 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వచ్చేలా మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ సెగ్మెంట్‌లోని ఎంపిక చేసిన మోడళ్లపై ₹1,000 నుండి ₹4,000 వరకు ధరలను పెంచినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 

ధరలు పెరిగిన ప్రముఖ మోడళ్లు

వివో T5x (vivo T5x) : ఈ మోడల్ పై అత్యధికంగా ₹4,000 వరకు పెరిగింది.

6GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు ₹22,999 కి చేరింది.

8GB + 256GB వేరియంట్ ధర ₹26,999 కి పెరిగింది.

వివో V70 సిరీస్ (vivo V70 Series):

V70: దీని ధర ₹4,000 పెరిగి, ప్రారంభ ధర ₹49,999 గా ఉంది.

V70 Elite: దీనిపై కూడా ₹4,000 వరకు పెరగడంతో 12GB వేరియంట్ ధర ₹59,999 కి చేరుకుంది.

వివో Y400 (vivo Y400) : ఈ మోడల్ ధరల్లో ₹3,000 నుండి ₹4,000 వరకు వ్యత్యాసం ఉంది. ఇప్పుడు దీని 8GB + 128GB వేరియంట్ ₹28,999 గా ఉంది.

వివో Y51 ప్రో : దీని ధర ₹3,000 పెరిగి, ప్రారంభ ధర ₹27,999 కి చేరింది.

వివో Y31 5G: ఈ మోడల్ పై ₹1,000 నుండి ₹3,000 వరకు పెరిగినట్లు సమాచారం. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement