Breaking News

ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా, భారతదేశంలోని తన అతిపెద్ద బాట్లింగ్ అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్‌ ను పబ్లిక్ ఇష్యూ కు తీసుకురావడానికి వేగంగా అడుగులు

ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా, భారతదేశంలోని తన అతిపెద్ద బాట్లింగ్ అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్‌ ను పబ్లిక్ ఇష్యూ కు తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది.


Published on: 02 Jul 2026 19:33  IST

ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా, భారతదేశంలోని తన అతిపెద్ద బాట్లింగ్ అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ను పబ్లిక్ ఇష్యూ కు తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు 1 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐపీఓ ముఖ్య వివరాలు

సేకరణ లక్ష్యం: రూ. 9,500 కోట్లు

కంపెనీ విలువ : ఈ ఐపీఓ ద్వారా భారతీయ బాట్లింగ్ యూనిట్ విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లు గా నిర్ణయించాలని కోకాకోలా భావిస్తోంది.

ప్రస్తుత పరిణామాలు: ఐపీఓ నిర్వహణ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను ఎంపిక చేసే ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే వారం లండన్‌లో ప్రెజెంటేషన్లు జరగనున్నాయి. ఈ లావాదేవీకి అడ్వైజర్‌గా ప్రముఖ సంస్థ Rothschild & Co వ్యవహరిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఐపీఓ 2027 నాటికి భారత స్టాక్ మార్కెట్లు అయిన BSE, NSE లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్‌

వ్యాపార విస్తరణ: బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో 14 అధునాతన తయారీ ప్లాంట్లు ఉన్నాయి.

నెట్‌వర్క్: దేశవ్యాప్తంగా 236 జిల్లాల్లో 17 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

ప్రముఖ బ్రాండ్లు: కోకాకోలాతో పాటు థమ్సప్, స్ప్రైట్ , మాజా , కిన్లీ  వాటర్ వంటి ప్రముఖ బ్రాండ్ల తయారీ, పంపిణీ బాధ్యతలను ఈ సంస్థే చూసుకుంటుంది.

వాటాల వివరాలు: గత ఏడాది కోకాకోలా సంస్థ తన గ్లోబల్ వ్యూహంలో భాగంగా HCCB మాతృసంస్థలోని 40% వాటాను జుబిలెంట్ భార్తియా గ్రూప్‌కు రూ. 12,500 కోట్లకు విక్రయించింది. ప్రస్తుతం కోకాకోలాకు ఇందులో 60% వాటా ఉంది.

భారతీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి ఉన్న భారీ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్, ఎల్‌జీ వంటి అంతర్జాతీయ దిగ్గజాల బాటలోనే ఇప్పుడు కోకాకోలా కూడా పయనిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement