Breaking News

ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బి. సాయిరాం ఎంపిక

ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా బి. సాయిరాం ఎంపికయ్యారు.


Published on: 17 Dec 2025 10:19  IST

ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా బి. సాయిరాం ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) సెప్టెంబర్ 2025లో ఈ పదవికి సాయిరాం పేరును సిఫార్సు చేసింది.సాయిరాం గారు విశాఖపట్నంకు చెందిన తెలుగు వ్యక్తి. రాయ్‌పూర్ నిట్ (NIT Raipur) నుండి మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

ఆయన ప్రస్తుతం నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.బొగ్గు రంగంలో 33 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం కలిగిన ఆయన, గతంలో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL)లో టెక్నికల్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 

తెలంగాణకు చెందిన నర్సింగరావు గారు గతంలో కోల్ ఇండియా సీఎండీగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు తెలుగు వ్యక్తి అయిన సాయిరాం ఈ ప్రతిష్టాత్మక పదవికి ఎంపిక కావడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి