Breaking News

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది


Published on: 16 Jun 2026 19:30  IST

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12 జూన్ 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 22 జూన్ 2026

ఆన్‌లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం): జూలై 2026 మొదటి వారం

శిక్షణ కాలం : 12 నెలలు

ఖాళీల వివరాలు

మొత్తం పోస్టులు: 4,500

ఆంధ్రప్రదేశ్ : 128 పోస్టులు

తెలంగాణ : 100 పోస్టులు

అర్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (అభ్యర్థులు 01-06-1998 మరియు 31-05-2006 మధ్య జన్మించి ఉండాలి).ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాషపై పట్టు కలిగి ఉండాలి.ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ. 15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

ఎంపిక విధానం

ఆన్‌లైన్ రాత పరీక్ష :100 ప్రశ్నలు - 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు.

స్థానిక భాషా పరీక్ష

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష

దరఖాస్తు ఫీజు

జనరల్ / OBC / EWS (పురుషులు): రూ. 944/-

జనరల్ / OBC / EWS (మహిళలు): రూ. 708/-

SC / ST / దివ్యాంగులు (PwBD) / ట్రాన్స్‌జెండర్: రూ. 236/-

అర్హత గల అభ్యర్థులు క్రింది రెండు పోర్టల్స్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి:

మొదటగా అభ్యర్థులు NATS Portal లో నమోదు చేసుకుని ఐడీ పొందాలి.ఆ తర్వాత BFSI SSC Portal ద్వారా లాగిన్ అయ్యి, సెంట్రల్ బ్యాంక్ అప్రెంటిస్ ఉద్యోగానికి దరఖాస్తు ప్రక్రియను మరియు ఫీజు చెల్లింపును పూర్తి చేయాలి.

Follow us on , &

ఇవీ చదవండి