Breaking News

కేంద్ర ప్రభుత్వంలో 186 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్డ్ర్టైజ్‌మెంట్ నెంబర్ 07/2026 ద్వారా భారీ నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వంలో (CDSCO) 186 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ 07/2026 ద్వారా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, ఆసక్తి గల అభ్యర్థులు 17 జూలై 2026 రాత్రి 6:00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: 07 Jul 2026 18:58  IST

కేంద్ర ప్రభుత్వంలో (CDSCO) 186 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ 07/2026 ద్వారా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, ఆసక్తి గల అభ్యర్థులు 17 జూలై 2026 రాత్రి 6:00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు

కేటగిరీల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి:

అన్రిజర్వ్డ్ (UR): 55 పోస్టులు

EWS: 41 పోస్టులు

OBC: 39 పోస్టులు

SC: 35 పోస్టులు

ST: 16 పోస్టులు

PwBD (దివ్యాంగులు): 08 పోస్టులు

విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి క్రింది కోర్సులలో ఉత్తీర్ణులై ఉండాలి:

B.Pharmacy లేదా ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిగ్రీ.లేదా MBBS (మెడిసిన్) క్లినికల్ ఫార్మకాలజీ లేదా మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌తో పూర్తి చేసి ఉండాలి.

గమనింపు: ఈ నోటిఫికేషన్‌కు ఎలాంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి

UR / EWS: గరిష్టంగా 30 సంవత్సరాలు

OBC: గరిష్టంగా 33 సంవత్సరాలు

SC / ST: గరిష్టంగా 35 సంవత్సరాలు

జీతం

ఇది కేంద్ర ప్రభుత్వ గ్రూప్ 'బి' గెజిటెడ్ (Group 'B' Gazetted) శాశ్వత ఉద్యోగం.

7వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్-8 (Pay Level-8) వర్తిస్తుంది (బేసిక్ పే ₹47,600 నుండి ₹1,51,100 వరకు).

అన్ని అలవెన్సులు (DA, HRA, TA) కలుపుకుని నెలకు దాదాపు ₹70,000 నుండి ₹90,000 వరకు ప్రారంభ జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం & దరఖాస్తు ఫీజు

ఎంపిక విధానం: అభ్యర్థుల దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/OBC/EWS అభ్యర్థులకు ₹25 మాత్రమే. SC/ST/దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

Follow us on , &

ఇవీ చదవండి