Breaking News

కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ప్రస్తుతం 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ప్రస్తుతం 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.


Published on: 18 May 2026 17:21  IST

కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ప్రస్తుతం 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) ఉద్యోగా భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12 మే 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 11 జూన్ 2026

మొత్తం ఖాళీలు: 660 పోస్టులు (మేనేజ్‌మెంట్ ట్రైనీ)

ప్రారంభ వేతనం: ఎంపికైన వారికి నెలకు దాదాపు రూ. 60,000 బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

అర్హతలు

అభ్యర్థులు సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ  ఉత్తీర్ణులై ఉండాలి.

మినహాయింపు: ఎస్సీ , ఎస్టీ  మరియు దివ్యాంగులకు  55% మార్కులు ఉంటే సరిపోతుంది.

చివరి సంవత్సరం విద్యార్థులు: 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 30 ఏప్రిల్ 2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము

జనరల్ / OBC / EWS: రూ. 1,180

SC / ST / PwD / కోల్ ఇండియా ఉద్యోగులు: ఎలాంటి ఫీజు లేదు (ఉచితం).

ఎంపిక విధానం

ఆన్‌లైన్ రాత పరీక్ష (Computer Based Test) లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement