Breaking News

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) విభాగంలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (MMGS-II) పోస్టుల భర్తీకి మే 13, 2026న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.


Published on: 18 May 2026 16:55  IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) విభాగంలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (MMGS-II) పోస్టుల భర్తీకి మే 13, 2026న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల: మే 13, 2026

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 13, 2026

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 02, 2026

అర్హత ప్రమాణాలు

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు IIBF నుండి తప్పనిసరిగా Forex Operations లో సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.

అనుభవం: ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి).

జీతం & పోస్టింగ్

జీతభత్యాలు: బేసిక్ పే స్కేల్ నెలకు రూ. 64,820 నుండి ప్రారంభమై, అన్ని అలవెన్సులతో కలిపి సుమారు రూ. 90,000+ వరకు ఉంటుంది.

పోస్టింగ్ ప్రదేశాలు: ఎంపికైన అభ్యర్థులకు ప్రధానంగా హైదరాబాద్ లేదా కోల్‌కతా లలో పోస్టింగ్ ఇస్తారు.

ఎంపిక విధానం & ఫీజు

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ మరియు ప్రత్యక్ష ఇంటర్వ్యూ (Personal Interview) ఆధారంగా ఎంపిక జరుగుతుంది (రాత పరీక్ష ఉండదు).

దరఖాస్తు ఫీజు: General/OBC/EWS అభ్యర్థులకు రూ. 750. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగులకు (PWD) ఎటువంటి ఫీజు లేదు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement