Breaking News

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్లో లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ 2026, ఏప్రిల్ 21న లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Notice) అందజేశారు.


Published on: 22 Apr 2026 14:58  IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ 2026, ఏప్రిల్ 21న లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Notice) అందజేశారు. ఈ నోటీసు ప్రధానంగా ఏప్రిల్ 18న ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రతిపక్ష ఎంపీలను విమర్శించిన తీరుపై ఇవ్వబడింది. 

మహిళా రిజర్వేషన్ మరియు లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని ప్రసంగించారు.బిల్లు ఓడిపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ప్రధాని విమర్శించడం, ఎంపీల ఓటింగ్ సరళిని తప్పుబట్టడం వంటి చర్యలు సభా హక్కుల ఉల్లంఘన మరియు సభా ధిక్కారం కిందకు వస్తాయని కాంగ్రెస్ పేర్కొంది.

పార్లమెంటులో బిల్లు వీగిపోయినందుకు ప్రతిపక్ష సభ్యులపై ప్రధాని బయట విమర్శలు చేయడం అనైతికం మరియు అధికార దుర్వినియోగం అని వేణుగోపాల్ తన నోటీసులో ఆరోపించారు.లోక్‌సభ నిబంధనల్లోని రూల్ 222 కింద ఈ నోటీసును స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement