Breaking News

కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం భారతదేశంలో పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులు భారీగా పెరిగాయి

కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం భారతదేశంలో పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులు భారీగా పెరిగాయి, ఈ కొత్త ధరలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.


Published on: 26 Jun 2026 19:22  IST

కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం భారతదేశంలో పాస్పోర్ట్ దరఖాస్తు ఫీజులు భారీగా పెరిగాయి, కొత్త ధరలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం ఈ ఫీజులను సవరించింది.

సాధారణ పాస్‌పోర్ట్ ఫీజులు

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ : పాత ఫీజు రూ. 1,500 నుండి ఇప్పుడు రూ. 2,500 కు పెరిగింది.

60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్: పాత ఫీజు రూ. 2,000 నుండి ఇప్పుడు రూ. 3,500 కు పెరిగింది.

తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజులు

36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్: పాత ఫీజు రూ. 3,500 నుండి ఇప్పుడు రూ. 5,000 కు పెరిగింది.

60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్: పాత ఫీజు రూ. 4,000 నుండి ఇప్పుడు రూ. 6,000 కు పెరిగింది.

మైనర్లు మరియు ఇతర సేవలు

మైనర్ల పాస్‌పోర్ట్ : సాధారణ విధానంలో 36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ. 1,000 నుండి రూ. 1,750 కి పెరిగింది. తత్కాల్ విధానంలో అయితే రూ. 4,250 గా నిర్ణయించారు.

పోగొట్టుకున్న/పాడైపోయిన పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్: 36 పేజీల బుక్‌లెట్ సాధారణ కేటగిరీకి రూ. 5,000, తత్కాల్‌కు రూ. 7,500 చొప్పున వసూలు చేయనున్నారు.

పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC): దీని రుసుమును కూడా రూ. 500 నుండి రూ. 750 కి పెంచారు.

ప్రత్యేక రాయితీలు మరియు ముఖ్యాంశాలు

10% రాయితీ: కొత్తగా పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే 8 ఏళ్ల లోపు పిల్లలకు, అలాగే 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు నిర్దేశిత ఫీజులో 10 శాతం రాయితీ లభిస్తుంది.

దరఖాస్తు గడువు: పెరిగిన ఫీజుల భారం పడకుండా పాత ధరలకే పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారు జూన్ 30 లోపు దరఖాస్తును పూర్తి చేసుకోవాలని నివేదించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement