Breaking News

సముద్రంలో చిక్కుకున్న నిపుణలను కాపాడిన మెరైన్ పోలీస్లు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో పూడిమడక-తంతడి మధ్య సముద్రంలో చిక్కుకున్న నలుగురు సాయిల్ టెస్ట్ నిపుణులను మెరైన్ మరియు స్థానిక పోలీసులు మత్స్యకారుల సహాయంతో సురక్షితంగా రక్షించారు.


Published on: 06 Aug 2026 15:33  IST

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో పూడిమడక-తంతడి మధ్య సముద్రంలో చిక్కుకున్న నలుగురు సాయిల్ టెస్ట్ (మట్టి పరీక్ష) నిపుణులను మెరైన్ మరియు స్థానిక పోలీసులు మత్స్యకారుల సహాయంతో సురక్షితంగా రక్షించారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిపుణులు: ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సాయిల్ టెస్టు నిర్వహించడానికి పశ్చిమ బెంగాల్ నుండి నలుగురు నిపుణులు అనకాపల్లికి వచ్చారు తెగిపోయిన పడవల తాళ్లు: వీరు సముద్రంలో సాయిల్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో, పరీక్షా వాహనాన్ని సముద్రంలోకి లాక్కొచ్చిన పడవల తాళ్లు ఒక్కసారిగా తెగిపోయాయి.

సముద్రంలో బందీలు: తాళ్లు తెగిపోవడంతో నియంత్రణ కోల్పోయిన ఆవాహనంలోనే నలుగురు నిపుణులు సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు .

రెస్క్యూ ఆపరేషన్

సకాలంలో స్పందన: సమాచారం అందుకున్న వెంటనే పూడిమడక మెరైన్ మరియు అచ్యుతాపురం పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు.

మత్స్యకారుల సహాయం: స్థానిక మత్స్యకారుల సహకారంతో సముద్రంలోకి వెళ్లి, చిక్కుకుపోయిన నలుగురు అధికారులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు .పోలీసుల సకాలం చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పింది

Follow us on , &

ఇవీ చదవండి