Breaking News

తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలలో నేటి నుంచి మొబైల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తూ తమిళనాడు హిందూ ధార్మిక, దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ

తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలలో నేటి (సెప్టెంబర్ 1, 2026) నుంచి మొబైల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తూ తమిళనాడు హిందూ ధార్మిక, దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Published on: 01 Sep 2026 14:59  IST

తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలలో నేటి (సెప్టెంబర్ 1, 2026) నుంచి మొబైల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తూ తమిళనాడు హిందూ ధార్మిక, దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల పవిత్రత, ప్రశాంత వాతావరణాన్ని కాపాడటంతో పాటు భక్తులు గర్భగుడిలోని దేవతామూర్తులను ఫొటోలు, వీడియోలు తీయడం, రీల్స్ చేయడం వంటివి అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొదటి దశలో 52 ఆలయాలు: ఈ నిషేధాన్ని రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 52 ప్రధాన ఆలయాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో తెలుగు భక్తులు ఎక్కువగా సందర్శించే అరుణాచలం ,తిరుత్తణి, మధురై మీనాక్షి అమ్మన్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

ఫోన్ డిపాజిట్ సౌకర్యం: భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లడానికి వీల్లేదు. దర్శనానికి వెళ్లే ముందు ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

లాకర్ రుసుము: ప్రతి మొబైల్ ఫోన్ భద్రపరచడానికి ₹5 రుసుముగా నిర్ణయించారు. ఫోన్ డిపాజిట్ చేసిన తర్వాత భక్తులకు ఇంటిగ్రేటెడ్ టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రసీదు అందిస్తారు.

VIPలకు కూడా వర్తింపు: సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు కూడా ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీయడంపై ఆంక్షలు వర్తిస్తాయి.

తనిఖీలు , ప్రకటనలు: ఆలయాల ఎంట్రీ గేట్ల వద్ద సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు స్పీకర్ల ద్వారా నిరంతరం అనౌన్స్‌మెంట్‌లు చేస్తున్నారు.

కాబట్టి, ఈ వారాంతంలో లేదా రాబోయే రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులు ఈ నిబంధనలను గమనించి, తదనుగుణంగా తమ దర్శన సమయాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement