Breaking News

బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది

బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తక్షణమే బదిలీ చేస్తూ, తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (GAD)కు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది.


Published on: 15 Oct 2026 15:35  IST

బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తక్షణమే బదిలీ చేస్తూ, తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (GAD)కు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది.

పబ్‌లో గొడవ: అక్టోబర్ 10వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని 'కావోర్ బార్ అండ్ రెస్టారెంట్' లో మైనర్లకు మద్యం సరఫరా కాకుండా చూసేందుకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

పోలీసులపై దురుసు ప్రవర్తన: ఆ సమయంలో అక్కడ ఉన్న యువతుల వయస్సు నిర్ధారణ కోసం ఐడీ కార్డులు అడగడంతో, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్, ఆయన స్నేహితులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాను ఐఏఎస్ అధికారినని చెబుతూ, విధుల్లో ఉన్న పోలీసులను దూషించి, దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

క్రిమినల్ కేసు నమోదు: ఈ ఘటనపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వికాస్ మర్మత్‌తో పాటు ఆయన స్నేహితులు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్‌లపై పోలీసులు క్రిమినల్ కేసు (FIR) నమోదు చేశారు.

ప్రభుత్వం చర్యలు: వికాస్ మర్మత్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ వివాదం తీవ్రం కావడంతో సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. అలాగే కుప్పం 'కాడా' తాత్కాలిక బాధ్యతలను చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి