Breaking News

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘ మేళా 2026 లో ఒక సాధువు తన విలక్షణమైన ఆధ్యాత్మిక దీక్షతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘ మేళా 2026 లో ఒక సాధువు తన విలక్షణమైన ఆధ్యాత్మిక దీక్షతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.


Published on: 07 Jan 2026 17:30  IST

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘ మేళా 2026 లో ఒక సాధువు తన విలక్షణమైన ఆధ్యాత్మిక దీక్షతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.బీహార్‌లోని సీతామఢీ జిల్లాకు చెందిన శంకర్ పురి అనే 26 ఏళ్ల సాధువు, గత ఏడు సంవత్సరాలుగా నిలబడే ఉంటున్నారు.ఈయన నిరంతరం నిలబడి ఉండటమే కాకుండా, తన ఆధ్యాత్మిక సాధనలో భాగంగా తరచుగా ఒంటి కాలిపై నిలబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.భోజనం చేయడం నుండి నిద్రించడం వరకు అన్ని పనులను నిలబడే నిర్వహిస్తారు. నిద్రపోయే సమయంలో తల ఆనించుకోవడానికి వీలుగా ఒక చెక్క ఊయల వంటి అమరికను (Wooden support) ఉపయోగిస్తారు.

ఆరు సంవత్సరాల వయస్సు నుండే సన్యాసం స్వీకరించినట్లు ఈయన పేర్కొన్నారు. నైమిశారణ్యం నుండి వచ్చిన ఈ సాధువు, తన మనసులో కలిగిన ఆలోచన మేరకు ఈ కఠినమైన దీక్షను ప్రారంభించారు. ఈ మాఘ మేళా జనవరి 3, 2026న ప్రారంభమై ఫిబ్రవరి 15, 2026 వరకు కొనసాగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి