Breaking News

మాల్వాన్‌ ప్రాంతంలోని దేవ్‌బాగ్‌ - తార్కర్లీ బీచ్‌ సమీపంలో సుమారు 70 నుండి 75 డాల్ఫిన్లు ఒకేసారి గుంపుగా సముద్రంలో విహరిస్తూ కనిపించాయి. 

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా కొంకణ్‌ తీరంలో ఫిబ్రవరి 18, 2026న ఒక అరుదైన దృశ్యం పర్యాటకులను కనువిందు చేసింది. మాల్వాన్‌ ప్రాంతంలోని దేవ్‌బాగ్‌ - తార్కర్లీ బీచ్‌ సమీపంలో సుమారు 70 నుండి 75 డాల్ఫిన్లు ఒకేసారి గుంపుగా సముద్రంలో విహరిస్తూ కనిపించాయి. 


Published on: 18 Feb 2026 10:25  IST

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా కొంకణ్‌ తీరంలో ఫిబ్రవరి 18, 2026న ఒక అరుదైన దృశ్యం పర్యాటకులను కనువిందు చేసింది. మాల్వాన్‌ ప్రాంతంలోని దేవ్‌బాగ్‌ - తార్కర్లీ బీచ్‌ సమీపంలో సుమారు 70 నుండి 75 డాల్ఫిన్లు ఒకేసారి గుంపుగా సముద్రంలో విహరిస్తూ కనిపించాయి. సాధారణంగా ఇక్కడ 2 నుండి 4 డాల్ఫిన్లు మాత్రమే కనిపిస్తుంటాయి, కానీ ఇంత పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు ఒకేచోట కనిపించడం ఇదే మొదటిసారి అని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

ఇవి హిందూ మహాసముద్ర హంప్‌బ్యాక్ (Indian Ocean Humpback) జాతికి చెందిన డాల్ఫిన్లని సముద్ర జీవ శాస్త్రవేత్తలు గుర్తించారు.సముద్ర జీవ శాస్త్రవేత్త విశాల్ భావే ఈ అద్భుతమైన దృశ్యాన్ని డ్రోన్ సాయంతో చిత్రీకరించారు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ భారీ డాల్ఫిన్ల సందడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే, పడవ శబ్దాలతో వాటికి ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement