Breaking News

తమిళనాడుకు చెందిన ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

తమిళనాడుకు చెందిన ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ (Devi Priya)ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మార్చి 2, 2026న తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, నటి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.


Published on: 03 Mar 2026 11:56  IST

తమిళనాడుకు చెందిన ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ (Devi Priya)ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మార్చి 2, 2026న తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, నటి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై పెరంబలూర్ జిల్లాలోని పడలూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.నటి దేవిప్రియ తన సహాయకుడు దివాకర్‌తో కలిసి చెన్నై నుంచి తేని జిల్లాకు షూటింగ్ నిమిత్తం కారులో బయలుదేరారు. దారిలో కారు టైరు పంక్చర్ కావడంతో, డ్రైవర్ ముత్తుగణేశ్ (Muthuganesh - 38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్నారు.ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ ముత్తుగణేశ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడటంతో అతడిని చికిత్స కోసం పెరంబలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాద సమయంలో కారు పక్కన నిలబడి ఉన్న నటి దేవిప్రియ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి