Breaking News

విజయ్ ప్రమాణ స్వీకారంలో ఎమోషనల్ అయిన త్రిష

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో హీరోయిన్ త్రిష భావోద్వేగానికి గురైన వీడియో వైరల్‌గా మారింది.


Published on: 11 May 2026 12:19  IST

విజయ్  తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో హీరోయిన్ త్రిష అందరి దృష్టిని ఆకర్షించారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి హాజరయ్యారు. నీలిరంగు చీరలో వచ్చిన త్రిష కార్యక్రమం మొత్తం సమయంలో ఎంతో ఆనందంగా కనిపించారు.

టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగం చేస్తుండగా త్రిష ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమ్మగిల్లడంతో పాటు కన్నీళ్లు తుడుచుకుంటూ చిరునవ్వు చిందించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా త్రిష రియాక్షన్‌పై విపరీతంగా స్పందిస్తున్నారు.

స్టేడియానికి చేరుకున్న సమయంలో మీడియా ప్రతినిధులు “ఇది తమిళనాడుకు పెద్ద రోజు కదా?” అని ప్రశ్నించగా, “అవును.. చాలా సంతోషంగా ఉంది” అని త్రిష స్పందించారు. ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్యక్రమంలో విజయ్ తల్లిని త్రిష ఆత్మీయంగా పలకరించడం కూడా ప్రత్యేక చర్చకు దారితీసింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తన తొలి ప్రసంగంలో ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. “నేనేం దైవదూతను కాదు.. మీలాంటి సాధారణ మనిషినే. నెరవేర్చలేని హామీలు ఇవ్వను” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తమిళనాడులో సామాజిక న్యాయం, లౌకికవాదంతో కూడిన కొత్త పాలన అందిస్తామని ప్రకటించారు.

ఇదిలా ఉంటే, విజయ్-త్రిషల అనుబంధంపై కోలీవుడ్‌లో చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘కురువి’, ‘లియో’ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘లియో’ సినిమాలో భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై, త్రిషతో ఆయన అనుబంధంపై గతంలో పలు గుసగుసలు వినిపించినా.. ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష భావోద్వేగానికి గురికావడం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి