Breaking News

మగ్రా గ్రామంలోని శీతలా మాత ఆలయం వద్ద తొక్కిసలాట 8 మంది మృతి

బిహార్‌లోని నలందజిల్లాలో మార్చి 31, 2026న ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మగ్రా గ్రామంలోని శీతలా మాత ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలు మరణించారు. 


Published on: 31 Mar 2026 12:27  IST

బిహార్‌లోని నలంద జిల్లాలో మార్చి 31, 2026న ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మగ్రా గ్రామంలోని శీతలా మాత ఆలయం (Maa Sheetla Mandir) వద్ద జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలు మరణించారు. 

చైత్ర మాసంలో చివరి మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. శీతలాష్టమి సందర్భంగా 'చద్దన్నం' ప్రసాదాన్ని సమర్పించేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.ఈ ప్రమాదంలో 8 మంది మహిళా భక్తులు మృతి చెందారు.పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకోవడంలో జాప్యం జరిగినట్లు సమాచారం.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement