Breaking News

తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యుడు, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. 

తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యుడు, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. 


Published on: 24 Feb 2026 16:28  IST

తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యుడు, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. సోమవారం (ఫిబ్రవరి 23, 2026) తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హఠాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో మరణించినట్లు ఆయన కుమారుడు శుభ్రాంశు రాయ్ ధృవీకరించారు.గత కొన్నేళ్లుగా ఆయన పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. మరణానికి కొన్ని రోజుల ముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు సమాచారం.

బెంగాల్ రాజకీయాల్లో 'చాణక్యుడు'గా పేరుగాంచిన ముకుల్ రాయ్, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. 1998లో మమతా బెనర్జీతో కలిసి టీఎంసీ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 

Follow us on , &

ఇవీ చదవండి