Breaking News

రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నేడు (మార్చి 12, 2026) హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్‌ను (Netflix Eyeline Studios) అధికారికంగా ప్రారంభించారు.


Published on: 12 Mar 2026 16:52  IST

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నేడు (మార్చి 12, 2026) హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ను (Netflix Eyeline Studios) అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే" అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ చలనచిత్ర హబ్‌గా మార్చాలన్న తన కల నిజం కావడానికి ఇది తొలి మెట్టు అని ఆయన పేర్కొన్నారు. 

నెట్‌ఫ్లిక్స్ రాకతో టాలీవుడ్, బాలీవుడ్‌లకే పరిమితం కాకుండా, ఇకపై హాలీవుడ్ కూడా హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.ముంబై తర్వాత భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు ఇది రెండో కార్యాలయం. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX), వర్చువల్ ప్రొడక్షన్‌పై దృష్టి సారిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో నెట్‌ఫ్లిక్స్ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని, అందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఆహ్వానించారు.

ఈ స్టూడియో రాకతో స్థానిక రచయితలు, దర్శకులు, నటులు మరియు సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సినీ నటుడు రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి