Breaking News

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అస్సాంలోని తేయాకు తోటలను సందర్శించారు

ప్రధాని నరేంద్ర మోదీ 1 ఏప్రిల్ 2026న అస్సాంలోని తేయాకు తోటలను సందర్శించారు. మోదీ స్వయంగా తేయాకు తోటల్లోకి వెళ్లి, అక్కడ పని చేస్తున్న మహిళా కార్మికులతో కలిసి సరదాగా కాసేపు తేయాకు ఆకులు కోశారు.


Published on: 01 Apr 2026 18:09  IST

ప్రధాని నరేంద్ర మోదీ1 ఏప్రిల్ 2026న అస్సాంలోని తేయాకు తోటలను సందర్శించారు. మోదీ స్వయంగా తేయాకు తోటల్లోకి వెళ్లి, అక్కడ పని చేస్తున్న మహిళా కార్మికులతో కలిసి సరదాగా కాసేపు తేయాకు ఆకులు కోశారు.

తేయాకు తోటల కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అస్సాం ప్రపంచ గర్వించదగ్గ ప్రాంతమని, అందులో డిబ్రూగఢ్ ఆత్మ వంటిదని పేర్కొంటూ కార్మికులను అభినందించారు.తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాని స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాముఖ్యత కూడా ఉంది. అస్సాంలో ఏప్రిల్ 9 నుండి ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్మికులతో ప్రధాని నేరుగా మమేకమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి