Breaking News

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తుది విడత పోలింగ్‌లో 92.47% ఓటింగ్ నమోదై చరిత్ర సృష్టించింది

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29, 2026న జరిగిన తుది విడత పోలింగ్‌లో 92.47% ఓటింగ్ నమోదై చరిత్ర సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్‌లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published on: 30 Apr 2026 15:07  IST

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29, 2026న జరిగిన తుది విడత పోలింగ్‌లో 92.47% ఓటింగ్ నమోదై చరిత్ర సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్‌లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

రెండు విడతల్లో కలిపి మొత్తం ఓటింగ్ శాతం 92.47% గా నమోదైంది.

మొదటి విడత (ఏప్రిల్ 23): 93.19%.

రెండవ విడత (ఏప్రిల్ 29): 91.66% నుండి 92.65% వరకు జిల్లాను బట్టి నమోదైంది.

ఈ ఎన్నికల్లో పురుషుల (91.74%) కంటే మహిళలు (93.24%) అత్యధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 87% పోలింగ్ జరిగింది, ఇది గత ఎన్నికల (61%) కంటే చాలా ఎక్కువ.

అత్యధికంగా పూర్బ బర్ధమాన్ జిల్లాలో 93.39% పోలింగ్ నమోదు కాగా, హుగ్లీ (91.41%), దక్షిణ 24 పరగణాలు (91.45%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని సర్వేలు Matrize, P-Marq బీజేపీకి మొగ్గు చూపగా, People's Pulse సర్వే టీఎంసీ గెలుస్తుందని అంచనా వేసింది.ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4, 2026న జరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి