Breaking News

యాపిల్‌ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్‌ స్టూడెంట్ ఛాలెంజ్-2026' లో విశాఖపట్నానికి చెందిన మానస్‌ మల్ల అద్భుత విజయం సాధించి గ్లోబల్ వేదికపై భారతదేశ కీర్తిని చాటాడు

యాపిల్‌ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్‌ స్టూడెంట్ ఛాలెంజ్-2026' (Swift Student Challenge 2026) లో విశాఖపట్నానికి చెందిన మానస్‌ మల్ల అనే ఇంజినీరింగ్ విద్యార్థి అద్భుత విజయం సాధించి గ్లోబల్ వేదికపై భారతదేశ కీర్తిని చాటాడు.


Published on: 13 May 2026 11:47  IST

యాపిల్‌ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్స్టూడెంట్ ఛాలెంజ్-2026' (Swift Student Challenge 2026) లో విశాఖపట్నానికి చెందిన మానస్మల్ల అనే ఇంజినీరింగ్ విద్యార్థి అద్భుత విజయం సాధించి గ్లోబల్ వేదికపై భారతదేశ కీర్తిని చాటాడు.

చారిత్రాత్మక విజయం: యాపిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్-15 ఎలైట్ (Elite) విజేతల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా మానస్ నిలిచాడు.ఈ విజయంతో జూన్ 9న అమెరికాలోని కాలిఫోర్నియాలో గల యాపిల్ పార్క్‌లో జరిగే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్' (WWDC) లో పాల్గొనేందుకు అతనికి ఆహ్వానం లభించింది. అక్కడ యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) తో మానస్ ముఖాముఖిగా మాట్లాడనున్నాడు.

మానస్ 'STEMQuest' అనే ఒక ప్రత్యేకమైన ఆఫ్‌లైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మరియు అగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఆధారిత లెర్నింగ్ యాప్‌ను రూపొందించాడు.

బట్టీల ద్వారా చదివే పద్ధతిని మార్చి, కథల రూపంలో విద్యాబోధన చేసేలా, మరియు విద్యార్థుల హావభావాలను (facial tracking) గుర్తించి వారి ఒత్తిడిని తగ్గించేలా ఈ యాప్ పనిచేస్తుంది. ఇది ఇంటర్నెట్ లేకపోయినా, తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లలో కూడా స్థానిక భారతీయ భాషలలో పనిచేస్తుంది. వినికిడి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కూడా సులభంగా ఉండేలా దీనిని డిజైన్ చేశాడు.మానస్ మల్లా విశాఖపట్నంలోని సాగర్ నగర్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం అక్కడ ఉన్న గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో (GITAM University) నాలుగో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ (CSE) చదువుతున్నాడు.

 

Follow us on , &

ఇవీ చదవండి