Breaking News

పోలవరం ప్రాజెక్టు, గోదావరి నది నీటి వినియోగం, మరియు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు నిరాకరించింది.

పోలవరం ప్రాజెక్టు, గోదావరి నది నీటి వినియోగం, మరియు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు ఈరోజు (13 జులై 2026) నిరాకరించింది.


Published on: 13 Jul 2026 14:33  IST

పోలవరం ప్రాజెక్టు, గోదావరి నది నీటి వినియోగం, మరియు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు ఈరోజు (13 జులై 2026) నిరాకరించింది.

సుప్రీంకోర్టు నిర్ణయం & ముఖ్యాంశాలు

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తక్షణమే స్టే (ఇంజక్షన్ ఉత్తర్వులు) ఇవ్వాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో తీవ్ర సాంకేతిక మరియు విధానపరమైన లోపాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది.రిజిస్ట్రీ రూల్స్ ప్రకారం ఇలాంటి ఒరిజినల్ సూట్ పిటిషన్‌ను ముందుగా చాంబర్ జడ్జి ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే, నేరుగా బెంచ్ ముందుకు రావడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ న్యాయవాది కోర్టుకు తెలిపారు.పిటిషన్‌లోని లోపాలను పూర్తిగా సవరించి, సరిదిద్దే వరకు ఈ కేసుపై ఎలాంటి విచారణ చేపట్టడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది.పిటిషన్‌పై కనీస విచారణ జరపకుండా ప్రతివాదులకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేమని పేర్కొంటూ, లోపాలు సరిదిద్దిన తర్వాతే మిగతా అంశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement