Breaking News

బీహార్‌లో గంగానదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు

బీహార్‌లో గంగానదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బీహార్‌లోని వైశాలి జిల్లా (హాజీపూర్), రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ శ్యామ్‌చంద్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.


Published on: 14 Oct 2026 15:57  IST

బీహార్‌లో గంగానదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బీహార్‌లోని వైశాలి జిల్లా (హాజీపూర్), రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ శ్యామ్‌చంద్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి (అక్టోబర్ 13, 2026) సుమారు 8:30 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ గంగా నదిలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

సహాయక చర్యలు:సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు నది నుంచి 14 మృతదేహాలను వెలికితీశారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. నది నుంచి సురక్షితంగా రక్షించిన ఐదుగురిలో ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రధాని మోదీ సంతాపం , పరిహారం:ఈ పడవ ప్రమాదంపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల,గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వైశాలి జిల్లా కలెక్టర్ వర్షా సింగ్ ఈ ప్రమాద వివరాలను ధృవీకరించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి